ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి అని చెప్పాలి  గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వేసిన పంటలు దెబ్బతింటున్నాయి ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది అని చెప్పాలి. ఇక భారీగా వర్షాలు కురుస్తూ ఉండటం వరద నీరు కూడా ఎక్కువగా వస్తూ ఉండటంతో కొన్ని కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ ప్రజలందరూ వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు ముంచుకు వస్తుందో అని భయపడిపోతున్నారు.



 అయితే ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఇక ఇప్పుడు మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు  ఈరోజు నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే అటు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగి పోయాయ్. ఈ క్రమంలోనే  సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.



 లోతట్టు ప్రాంతాల నుంచి అటు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడంతో ఇప్పటికే అధికారులు పూర్తిగా నిమగ్నం అయ్యారు. అయితే ఇక ఇప్పుడు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కొండచరియలు విరిగి పడే అవకాశాలు కూడా ఉన్నాయని దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున ఇక స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ ప్రజలందరికీ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: