వ్యాక్సినేషన్ లో ప్రస్తుతం భారత్ దూసుకుపోతుంది. తిరుగులేని విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకు సైతం భారత పట్టుదల ఆదర్శంగా నిలుస్తుంది అనే చెప్పాలి.. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికలను ఫాలో అవుతూ అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయ్. అయితే మొదట్లో వ్యాక్సిన్ ఫై ఎన్నో అనుమానాలు అపోహలతో దూరంగా ఉన్న జనాలు ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి అవగాహన రావడంతో వాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రోజురోజుకు  భారత్లో వాక్సినేషన్ ప్రక్రియ పెరుగుతూ వస్తోంది.



 ప్రస్తుతం కరోనా వైరస్ తో సమర్థవంతంగా పోరాటం చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఊహించనంత వేగంగా టీకాలు వేయడం పైన భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఇలా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తూ రోజురోజుకీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది భారత్. ఇక అభివృద్ధి చెందిన దేశాలు సైతం వేయనన్ని టీకాలు వేసి ప్రస్తుతం ఔరా అనిపిస్తుంది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య నేటికీ 100 కోట్లు దాటింది. ఈ క్రమంలోనే భారత్ సాధించిన ఈ  గొప్ప రికార్డును ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.





 ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగా కూడా అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో విమానాల్లో షిప్స్ లో కూడా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ సాధించిన విషయాన్ని లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నట్లు  తెలుస్తోంది. ఇక వ్యాక్సిన్ 100 కోట్లు డోసులు చేసిన సందర్భంగా సింగర్ కైలాష్ ఖేర్ పాడిన ఒక పాటను ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవ్య విడుదల చేయబోతున్నారు. ఇక ఇటీవల దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా చరిత్ర లిఖించింది. 130 కోట్ల భారతీయులు సమిష్టిగా సాధించిన విజయమిది అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: