కట్ చేస్తే అక్కడ బీజేపీ సంచలన విజయం సాధించింది. దుబ్బాక రిజల్ట్ ఉత్సాహంతోనే జీ హెచ్ ఎంసీ లో సైతం కారు పార్టీకి షాక్ ఇచ్చే రేంజ్లో కార్పొరేటర్ స్థానాలు గెలుచు కుంది. ఆ ప్రభావం రాష్ట్రం అంతటా చూపించింది. ఇప్పుడు హుజూరా బాద్‌లో కూడా అదే ఫలితం రిపీట్ అయితే కేసీఆర్ హవాకు చాలా వరకు బ్రేకులు పడిపోయినట్లవుతుంది. కేవలం ఈ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకం పుట్టుకొచ్చింది అంటే పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలే దేమో..!
ఇక అధికారం చేతిలో ఉండడంతో టీఆర్ ఎస్ కులాల వారీగా నేతలను దింపేసి.. పథకాలు ఇస్తూ వారిని తమ వైపునకు తిప్పు కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చివరకు కేసీఆర్ సైతం హుజూరాబాద్ లో చివరి మూడు రోజులు లేదా రెండు రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత ప్లానింగ్ ఉన్నా కూడా దుబ్బాకలో రఘునందన్‌పై ఉన్న సింపతీ ముందు టీఆర్ఎస్ ప్రభంజనం పని చేయలేదు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే రిపీట్ అవుతుందా ? అన్న టెన్షన్ కేసీఆర్ ను అయితే వెంటాడుతోందట.