ప.గో : ఇటీవల సీఎం జగన్ కారుణ్య  నియామకం పై తీసుకున్న నిర్ణయం అనందనియమని.. కరోనా ముందు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం చెయ్యాలని పేర్కొన్నారు  ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరజు వెంకటేశ్వర్లు.  నో ప్రాపర్టీ సర్టిఫికెట్ కు వెసులుబాటు కల్పించాలని.. కారుణ్య నియామకాలు బాధ్యతలు సంబధిత శాఖలకు అప్పగించాలని వెల్లడించారు ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరజు వెంకటేశ్వర్లు.  మేము దాచుకున్న డబ్బు మాకు అందించాలని.. Gpf సమస్య పై  రేపు 27 న జరగనున్న సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసికువెళ్తమని స్పష్టం చేశారు బొప్పరజు వెంకటేశ్వర్లు. 

11 వ పి.ఆర్.సి అమలు నివేదిక ను ముందే ఉద్యోగ సంఘాలకు బహిర్గతం చేయాలని.. 2012 నుండి పెండిగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు బర్తి చెయ్యాలని వెల్లడించారు బొప్పరజు వెంకటేశ్వర్లు.  అనంతరం సెక్రెటరీ జనరల్ వై.వి.రావు మాట్లాడుతూ..  ఈ నెల 27 . జరిగే సమావేశంలో పలు అంశాల పై చర్చిస్తామని స్పష్టం చేశారు సెక్రెటరీ జనరల్ వై.వి.రావు.  ప్రధానంగా సి.పి.యస్ రద్ధు ప్రధానంగా చర్చకు వస్తుందని సెక్రెటరీ జనరల్ వై.వి.రావు పేర్కొన్నారు.  తక్ఫణమే సి.యం చొరవ తీసుకుని సిపియస్ రద్ధు చేసి ఒపియస్ అమలు చేస్తారను కుంటున్నామన్నారు సెక్రెటరీ జనరల్ వై.వి.రావు. ఉద్యోగుల హైదరాబాద్ ల్త్ కార్డులు అన్ హెల్త్ కార్డులు గా మారాయన్నారు సెక్రెటరీ జనరల్ వై.వి.రావు.
 
ఇ.హెచ్.యస్ నుంచి చాలా హాస్పిటల్స్ బయటకు వచ్చేశాయని. అన్ని కారుణ్య నియామకాలు త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సెక్రెటరీ జనరల్ వై.వి.రావు. అలా చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం చేసిన వారవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. కాగా ఇటీవల జరిగిన కరోనా సమీక్ష లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా తో మృతి చెందిన వారి కుటుంబాలకు శుభవార్త చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: