హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఆవేదనను పంచుకున్నారు. భారత్ ఓటమి చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఈ మ్యాచ్ పై తాను ఆశించిన ఫలితం రాలేదని వెల్లడించారు. వేరే ఏ జట్టుతో ఓడిపోయినా పెద్దగా చర్చించే వారము కాదు. అంత అభ్యంతరం ఉండేది కాదని, పాకిస్తాన్‌తో ఓడిపోవడం అత్యంత బాధకరం. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాతో పాటు ఇతన మాధ్యమాల్లో భారత్ గెలుస్తుందని వార్తలు వినిపించాయి. కానీ మ్యాచ్ ఫలితంలో పాకిస్తాన్ అలవకగా విజయాన్ని అందుకుందని వెల్లడించారు. భారత్ ఓడిపోవడానికి కరోనా కూడ ఒక కారణం అయిఉండవచ్చని చెప్పారు.
దాదాపు 4 నెలల పాటు భారత జట్టు ఐసోలేషన్‌లో ఉంది. అంతేకాకుండా కొంతమంది ఆటగాళ్లు గాయాలతో బాధపడ్డారు. ఇవన్నీ ఓటమికి కారణం అయి ఉండవచ్చు. టీమిండియా ఓడిపోతుందని అసలు ఊహించలేదని వెల్లడించారు. ఇది అసలు ఊహించని ఫలితం అని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ జట్టు చాలా బాగా ఆడిందని కొనియాడారు. అదేవిధంగా టీ-20 వరల్డ్ కప్ లో తమకు ఉన్న చెత్త రికార్డును చేరిపేసుకొని పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది 151 పరుగులు సాధించారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది జట్టు ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా అలవకగా 18.5 ఓటర్లలో టార్గెన్‌ను పూర్తి చేశారు. వికెట్ నష్టపోకుండా ఓపెనర్లు బాబర్ అజామ్ 52 బంతుల్లో 68 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.