వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న గౌరు కుటుంబం 2014లో పాణ్యం నుంచి చరిత విజయం దక్కించుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో తలెత్తిన విభేదాల కారణంగా.. ఎన్నికలకు ముందు.. టీడీపీ లోకి వచ్చారు. అయితే.. జగన్ సునామీతో ఓడిపోయారు.ఈ క్రమంలో వారు పార్టీ మారతారని.. గత ఏడాది న్నరగా ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఎప్పుడూ స్పందించని ఈ ఫ్యామిలీ.. టీడీపీని డెవలప్ చేయ డంతో మౌనంగానే ఇలాంటి విమర్శలకు సమాధానం ఇచ్చింది.
తాజాగా కల్లూరు మండలం ఎ.గోకులపా డు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తం 50 మంది వైసీపీ కార్యకర్తలు గౌరు దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు. కల్లూరు మండల మాజీ అధ్యక్షుడు బాల వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్.చంద్రకళాధర్ రెడ్డి, గోకులపా డు మాజీ సర్పంచ్ లక్ష్మీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులకు టీడీపీ కండువాలు వేసీ పార్టీలోకి ఆహ్వా నించారు.
ఈ పరిణామంతో గౌరు ఫ్యామిలీ సైలెంట్‌గా దూకుడు ప్రదర్శిస్తోందని.. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే తరహా పరిస్థితి పుంజుకుంటే.. వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో ను, పాణ్యంలోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. మొత్తానికి తమ పనితీరుతో.. ఇద్దరూ కూడా రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడం గమనార్హం.