వైసీపీని అధికారంలో నుంచి దించేసి వెంటనే అధికారంలోకి వచ్చేయాలని విధంగా టీడీపీ ఎన్నిరకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అసలు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి అదే పనిలో ఉంది..కానీ ఎక్కడా కూడా టీడీపీకి ఆ ఛాన్స్ దొరకడం లేదు. చెప్పాలంటే వైసీపీ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే వైసీపీని మాత్రం అనుకున్న స్థాయిలో దెబ్బకొట్టలేకపోయింది.
 
ఇంకా రెండున్నర ఏళ్లు అయినా సరే కొన్ని చోట్ల వైసీపీకి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే..వైసీపీకి కంచుకోటలుగా ఉండే స్థానాలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే నలభై ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీకి కంచుకోటలు ఉన్నాయి. వాటిల్లో వైసీపీని ఓడించడం టీడీపీ వల్ల కాదనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో పరిస్తితి చూస్తుంటే...టీడీపీ మళ్ళీ ఆ స్థానాల్లో వైసీపీకి గెలవడానికి ఛాన్స్ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది.

అలా వైసీపీకి కంచుకోటలుగా ఉన్న పార్లమెంట్ స్థానాల గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్థానాలు ఏవి అనేది కూడా బాగా క్లారిటీ ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో ఆ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది...ఇక వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

అలా వైసీపీకి అనుకూలంగా ఉన్న కంచుకోటలుగా గురించి వస్తే ముందుగా...కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. వీటిల్లో వైసీపీకి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదు. అలాగే కర్నూలు, నంద్యాల స్థానాల్లో కూడా వైసీపీ సత్తా ఏంటో చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండుచోట్ల కూడా వైసీపీదే పైచేయి. ఇటు వస్తే ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీదే ఆధిక్యం. తిరుపతి, అరకు స్థానాల్లో కూడా వైసీపీకి తిరుగులేదు. ఇకపోతే చిత్తూరులో ప్రస్తుతానికి వైసీపీదే లీడింగ్...మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితి ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: