మొన్నటివరకు చైనా అగ్రరాజ్యమైన అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచ పెద్దన్నగా మారేందుకు ఎన్నో రకాల కుట్రలు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా దొడ్డు దారులు కూడా తొక్కింది చైనా. అదే సమయంలో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు కూడా ప్రయత్నించింది. కనిపించిన భూభాగం మొత్తం తమదే అంటూ విస్తరణ వాద ధోరణితో ముందుకు సాగింది చైనా. ఇలాంటి సమయంలో రోజు రోజుకి చైనా తీరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక ప్రపంచ వినాశనం కోసం ఏకంగా కరోనా వైరస్ నీ ప్రయోగించింది. ఇది కాస్తప్రపంచ దేశాలలో చైనాపై పూర్తి స్థాయి వ్యతిరేకతను తీసుకువచ్చింది.



 అయితే మొన్నటి వరకూ తాము మరికొన్ని రోజుల్లో అమెరికాను వెనక్కి నెట్టి మొదటి స్థానం లోకి రాబోతున్నాము అంటూ ప్రగల్భాలు పలికిన చైనా ఇక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఎన్నో సంస్థలు చైనా నుంచి వెళ్లిపోయాయ్. విదేశీ ఉద్యోగులు సైతం చైనాను వదలారు. ఇక ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కారణంగా ఏకంగా మూడు ట్రిలియన్ డాలర్ల సంక్షోభంలో కూరుకుపోయింది చైనా. ఇక వివిధ రాష్ట్రాల అప్పుల కారణంగా మరో 5 ట్రిలియన్ డాలర్ల అప్పులతో కలిపి మొత్తం ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అప్పులు ప్రస్తుతం చైనాకు పెరిగిపోయినట్లు తెలుస్తోంది.



 అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియకుండా చైనా అసలు విషయాలన్నింటినీ కూడా దాచిపెడుతుంది. కానీ క్రమక్రమంగా ఒక్కో విషయం కూడా బయట పడుతూ ఉండటం గమనార్హం. అయితే మొత్తంగా చైనా అప్పులు 19 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి అన్న విషయం బయటపడింది. వివిధ రాష్ట్రాల అప్పులు, రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభం కారణంగా 8 బిలియన్ డాలర్లు ఉంటే.. ఇతర దేశాలకు ఇచ్చిన అప్పుల కారణంగా డబ్బులు కొరత ఏర్పడిందని.. ఇలా మొత్తంగా 19 ట్రిలియన్ డాలర్ల సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం ఇటీవల బయటపడింది. అయితే అసలు నిజాలు దాచి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: