అప్పట్లో సాధారణ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం కావడంతో టిడిపిలో ఉంటే అధికార వైసీపీ నుంచి తమకు.. తమ వ్యాపారాలకు ఇక్కట్లు తప్పవనే వీరు బిజెపిలో చేరారు. ఇక ఇప్పుడిప్పుడే ఏపీలో అధికార వైసీపీ పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగు తున్నాయి. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండడంతో వ్యతిరేకత ఎక్కువుగా ఉంది. ఇంకే ముందు ఏపీలో మళ్లీ టీడీపీ యే గెలుస్తుంది.. కేంద్రం లో బీజేపీ ఎలాగూ అధికారంలోకి రాదని లెక్కలు వేసుకుంటోన్న వీరంతా తిరిగి టీడీపీలోకి వచ్చే ప్లాన్లు వేసుకుంటున్నారట.
అయితే ఇదంతా ఇప్పటి కిప్పుడు జరగదని టాక్ ? వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగి పోయి.. టీడీపీ మరింత పుంజుకోవడంతో పాటు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు ఎక్కువుగా వచ్చిన వెంటనే వీరు కండువాలు మార్చేస్తారట. సుజనాచౌదరి - సిఎం రమేష్ - టి.జి.వెంకటేష్ కు పార్టీలు, వ్యవహారాలు, నమ్మకాల కన్నా వారి రాజకీయ అవసరాలు , వ్యాపారాలే ముఖ్యం అన్న టాక్ ఉండనే ఉంది.