కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం తర్వాత గుండెపోటుపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. అన్ని విధాలుగా ఫిట్‌గా ఉండే.. పునీత్‌ రాజ్‌కుమార్‌.. కేవలం 46 ఏళ్ల వయస్సులోనే హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం ఏకంగా భారత దేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలా ఎలా జరిగింది.. అన్న చర్చ అందరినోటా వినిపించింది. చిన్న వయస్సులోనే ముంచుకొస్తున్న గుండె జబ్బులపై చర్చకు తెర తీసింది. ఈ సమయంలో అసలు హైదరాబాద్‌లో ఏటా .. 15 వేల వరకూ గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయన్న లెక్కలు ఆలోచింపజేస్తున్నాయి.


ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఏటా హృద్రోగ ముప్పు పెరుగుతుందంటున్న ఆరోగ్య నిపుణులు.. 30 నుంచి 40 ఏళ్ల మధ్యలోనే గుండె జబ్బులబారిన పడుతున్నారని చెబుతున్నారు.  కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ మాత్రమే కాదు.. గతంలోనూ ఇలాగే మరికొందరు ఆటలాడుతూ.. వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మారుతున్న కాలం, ఆహార, ఆరోగ్య అలవాట్ల కారణంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా 15 వేల వరకు గుండె శస్త్రచికిత్సలు జరుగుతున్నాయట. అందులోనూ 8 నుంచి 10 వేల వరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలే జరుగుతున్నాయట.


ఒక్క నిమ్స్‌లోనే ఏటా వెయ్యి వరకు బైపాస్‌ సర్జరీలు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.  స్టెంట్లు, ఇతర చికిత్సలు కలిపి ఇవి మరో 2000 వరకు ఉంటున్నాయట. ఇందులో 30 నుంచి 40 శాతం మంది 50 ఏళ్లలోపు వారేనని వైద్యు నిపుణులు చెబుతున్నారు. ఇలా 30  ఏళ్ల వయసు నుంచే హృద్రోగ సమస్యలు పెరగడానికి కారణాలు కూడా వైద్యులు చెబుతున్నారు. వృత్తి, వ్యక్తిగత ఒత్తిడి, మారుతున్న లైఫ్ స్టయిల్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎక్కువగా గుండె జబ్బులకు హైబీపీమని చెబుతున్న వైద్యులు.. ఇవి బయటకు ఎలాంటి హెచ్చరికలు, లక్షణాలు, సంకేతాలు కనిపించవని చెబుతున్నారు. అందుకే బీపీ 140/80కి దిగువన ఉండేలా చూసుకోవాలని.. సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: