ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా రాజకీయం చేయడమే కాకుండా మంత్రుల పనితీరుకు సంబంధించి అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది మంత్రులు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల విషయంలో తప్పులు చేస్తున్న నేపథ్యంలో వారిని పూర్తిగా పక్కన పెట్టేందుకు ఆయన రెడీ అయ్యారు. మాట వినని వారు విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నట్లు గా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పరిపాలన విషయంలో తమ మాట వినని వారిని కూడా ఆయన పక్కన బెట్టడానికి సిద్ధమవుతున్నారని కొంతమంది అంటున్నారు.

తాజాగా ఇద్దరు మంత్రులకు శాఖల లో జగన్ కోత విధించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. త్వరలోనే మరికొంత మంది మంత్రులతో కూడా జగన్ షాక్ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కీలక నాయకులు కొంతమంది నియోజకవర్గాలకు వెళ్లకపోవడం అదేవిధంగా ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉండక పోవడం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళ లేక పోవడం వంటివి కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో త్వరలోనే జగన్ వారికి షాక్ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కొంత మంది మంత్రుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని ఆ మంత్రులు నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరుగుతున్నారా లేదా అధికారులు అందుబాటులో ఉన్నారా లేదా అనే దానితో పాటుగా సోషల్ మీడియాలో ఎంత వరకు తెలుగుదేశం పార్టీ మీద దృష్టి పెట్టారు అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పేరు వింటే చాలు కొంతమంది మంత్రులు వాడికి పోతున్నారని ప్రధానంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి గారైతే నియోజకవర్గంలోని ఎక్కువగా ఉంటున్నారు అని సచివాలయానికి కూడా వెళ్లడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: