ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే సంగతి అందరికీ తెలుసనే చెప్పాలి...లేదు లేదు...ఆర్ధిక మంత్రి కంటే అప్పుల మంత్రిగా బుగ్గన మంచిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం సృష్టించి రాష్ట్రంలో ఆర్ధిక పరిస్తితులని మెరుగు పరచడంలో కంటే...నెల నెలకు అప్పులు తెచ్చి...వాటిని పథకాలకు ఖర్చు పెట్టడంలో బుగ్గన చొరవ కాస్త ఎక్కువే. అయ్యో ప్రతిదీ అప్పు తేవాల్సిందేనా? అని అడిగితే...అసలు అప్పు లేకపోతే ఎలా అంటారు బుగ్గన.

ఇక దేశంలో అప్పులు చేయడం లేదా? ఇతర రాష్ట్రాలు అప్పులు చేయడం? లేదా అని బుకాయిస్తారు. అంటే ఇతర రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుంది? మనకు ఎంత ఆదాయం వస్తుంది? అంటే సమాధానం ఉండదు. పైగా ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు? అంటే రెండు, మూడు రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాంగా అని బుకాయిస్తారు. అందుకు ఉద్యోగులు కూడా సిద్ధంగానే ఉన్నారని చెబుతున్నారు.
 
అదే చంద్రబాబు సమయంలో ఏ రోజు కూడా జీతాలు ఇచ్చే విషయంలో 1వ తేదీ దాటనివ్వలేదు. ఒకవేళ దాటితే ఉద్యోగులు బాబుని ఎన్ని రకాలుగా తిట్టేవారో అందరికీ తెలుసు. ఇక అప్పులు విషయంలో కూడా బాబుని ఎలా విమర్శించేవారు కూడా తెలిసిందే. అప్పుడు పి‌ఏ‌సి ఛైర్మన్‌గా ఉండి బుగ్గన ఎలాంటి హడావిడి చేశారో కూడా తెలుసు.
 
కానీ అప్పుడు కంటే ఇప్పుడు డబుల్ అప్పులు తెస్తున్నారు. అదేంటి అని ఇప్పుడు అడిగితే... అప్పులు తేవడం కూడా పాలనలో ఒక భాగమని, సంక్షేమం కోసమే అప్పులు చేశామని బుగ్గన గారు సెలవిస్తారు. ఆఖరికి గవర్నర్‌ని అడ్డం పెట్టుకుని కూడా అప్పులు తెచ్చేస్తారు. పైగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి 4 శాతానికి మించకూడదని, కానీ 11 శాతానికి వెళ్లిందని, దీనిపై కూడా సమాధానమిస్తామని గొప్పగా చెబుతారు. అంటే 11 వరకు వెళ్ళిందంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఏం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు...మొత్తానికి వైసీపీ ప్రభుత్వం...రాష్ట్రాన్ని గట్టిగానే ముంచేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: