ఏపీ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో...వంగవీటి రంగా అంటే అదొక బ్రాండ్ అన్నట్లు ఉండేది..ఇక రంగా తర్వాత....రాధా కాపుల సమాజనికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అలాంటి నాయకుడు రాజకీయంగా మాత్రం సరిగ్గా సెట్ అవ్వలేదనే చెప్పాలి. తన తండ్రి మాదిరిగానే కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టి, తొలిసారి ఎమ్మెల్యే అయిన రాధా...ఆ తర్వాత నుంచి నిలకడగా రాజకీయం చేస్తూ రాలేదు.

పార్టీలు మారిన సరే ప్రయోజనం లేకుండా పోయింది...ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళినా సరే, రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రాధా ఏ పార్టీలో ఉన్నారనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే గత ఎన్నికల ముందు రాధా...టీడీపీలో చేరారు...కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు. ఇక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక రాధా సైలెంట్ అయిపోయారు. ఏ పార్టీలోనూ రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు.

ఒక ఇండిపెండెంట్‌ లీడర్‌గా ఉంటూ..తన సామాజికవర్గం తరుపున జరిగే కార్యక్రమాలకు మాత్రం హాజరు అవుతున్నారు. అయితే మధ్యలో తన స్నేహితుడైన కొడాలి నాని ద్వారా మళ్ళీ వైసీపీలోకి వెళ్లిపోతారని, అటు జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం వచ్చింది. కానీ రాధా ఎటూ వెళ్లలేదు.

అలా అని టీడీపీలో సరిగ్గా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల రాధా...గుడివాడ రాజకీయాల్లో కాస్త హల్చల్ చేస్తున్నారని ప్రచారం వచ్చింది. అలాగే నెక్స్ట్ టీడీపీ తరుపున గుడివాడలో పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా రాధా పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లతో సహ ఇతర టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే టీడీపీ నాయకుడు రాధా అంటూ పోస్టులు పెట్టారు. అంటే రాధా ఇంకా టీడీపీ నాయకుడుగానే ఉన్నారని, ఆ పోస్టుల ద్వారా తెలుస్తోంది. అలాగే రాధాని వదులుకోకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: