అయితే చిన్నాచితక ఎన్నికలు జరిగితే క్షేత్ర స్థాయిలో టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాయి. ఇక తాజాగా స్థానిక ఎన్నిక ఎన్నికలకు మళ్ళీ షెడ్యూల్ విడుదలైంది..ఎన్నికలు జరిగిపోగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల టీడీపీ-జనసేనలు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆకివీడు మున్సిపాలిటీలో రెండు పార్టీల పొత్తు ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మున్సిపాలిటీలో టీడీపీ స్ట్రాంగ్ గానే ఉంది. ఎందుకంటే ఆకివీడు మున్సిపాలిటీ ఉండి అసెంబ్లీ పరిధిలో ఉంది. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు పనిచేస్తున్నారు. పైగా ఉండి టీడీపీ కంచుకోట కాబట్టి, ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి తిరుగులేదు.
అయితే అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే ఇక్కడ టీడీపీ, జనసేన సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. అలా అని జనసేనకు సొంతంగా సత్తా చాటే అవకాశం లేదు. కాబట్టి టీడీపీతో కలిసి వైసీపీకి చెక్ పెట్టాలని అనుకోవచ్చు. కాబట్టి రెండు పార్టీలు కలిసి ఆకివీడులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.