ఈ సారి ప్రతిపక్ష పార్టీల పొత్తులు , ఎత్తులను బట్టే అభ్యర్థుల ఎంపిక ఉండనుందని తెలుస్తోంది. అందుకే జగన్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటు ఎమ్మెల్యేల అను పని తీరు పరంగా అప్రమత్తం చేసుకుంటూ వస్తున్నారు. జనసే న - టీడీపీ పొత్తు ఉన్నప్పుడు అనేక చోట్ల అభ్యర్థులను మార్చాల్సి ఉంటుందన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కూడా గెలిస్తే ఏపీ లో టీడీపీ తో పాటు జనసేన ను కూడా పూర్తి మటాష్ చేసేయవచ్చని.. అప్పుడు మరో పదేళ్ల పాటు తనకు తిరుగు ఉండదని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి జనసేన ప్రభావం గట్టిగా ఉండే ఉత్తరాంధ్ర జిల్లా లతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సారి ఎక్కువ మంది సిట్టింగ్ లను మారుస్తారట. ఇక కాపు లతో పాటు కమ్మ ఓటు బ్యాంకు బలంగా ఉన్న చోట ఎక్కువ మంది ఎమ్మెల్యే లపై వ్యతిరేకత ఉందని జగన్ సర్వే లో తేలడంతో ఈ ప్రాంతాల్లో కూడా సిట్టింగ్‌లకు ఉద్వాసన తప్పదని అంటున్నారు.