అయితే నాలుగు చోట్ల మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అవి గుంటూరు జిల్లా లోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలు అధికార పార్టీకి అంత సులువుగా జరిగేలా లేవు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఉండి నియోజకవర్గంలో ఉంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ముందుగానే జనసేన తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నారు. అక్కడ జనసేన ఓటింగ్ బలంగా ఉంది. దీంతో అక్కడ వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు.
ఇక అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం కూడా టీడీపీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ మంత్రి శంకర్ నారాయణ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయనపై స్థానికంగా సొంత పార్టీ నేతల్లోనే యాంటీ ఉంది. దీంతో అక్కడ కూడా టీడీపీకి కాస్త వేవ్ కనిపిస్తోంది.