ఎముకలు కొరికే చలిలో, భగభగ మండే ఎండలో, ఈడ్చి కొట్టే   జడివాన ను దాటుకుంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర  ఆయనను ఇప్పుడు ఈ స్థానంలో ఉంచింది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు  పాదయాత్రకు ఈ రోజుకు నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్ని సమస్యలు వచ్చినా గమనమే తప్ప తిరోగమనం తెలియని జగన్మోహన్రెడ్డికి ఆ పాదయాత్ర  ఎంతో ప్రతిష్టాత్మకమైన అని చెప్పవచ్చు. 13 జిల్లాల్లో ఏకధాటిగా పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను తన కళ్ళారా చూసిన జగన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తరహాలోనే  పాలన కొనసాగిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తండ్రి చూపించిన బాట ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల అడుగుల్లో అడుగులు వేస్తూ  పేద ప్రజల మధ్య లోకి వెళ్తే పవర్ లోకి వస్తా మనే సెంటిమెంటు, రూముల్లో కూర్చుంటే రాజకీయం కాదని  ప్రజల్లోకి వెళితేనే ఆదరణ దక్కుతుందనే ఆలోచనతో  పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు వైయస్ జగన్. ఆనాడు ఆయన ఆలోచన ఆంధ్రప్రదేశ్ అంతా చుట్టేలా  సుదీర్ఘమైన పాదయాత్రతో  ముందుకు వెళ్లారు. 14 నెలలు సాగిన యాత్ర  ప్రతి మారుమూల పల్లెల్లో కి, ప్రతి పేదవాడి గుండెల్లో ఒక చరిత్ర సృష్టించేలా నేనున్నానంటూ సాగిపోయింది అని చెప్పవచ్చు.

ఈ పాదయాత్రలో అధికార పార్టీ అరాచకాలను ఎండగడుతూ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రజల ముందుకు వచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆనాడు జనం  మధ్య నివాసం, జనం తోనే సహవాసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యం ఇలా ఈ మూడు పాయింట్లతో పాదయాత్ర మొదలు పెట్టిన జగన్  ఎంతో సక్సెస్ ను సాధించాడు. ఆయన లక్ష్యం ఒకటి రెండు రోజులు కాదు ఏడాదికి పైగా ప్రజల్లోనే ఉంటూ  నేనున్నానని భరోసా కల్పించి ప్రజల మధ్యలోనే తిరిగాడు. ఏకంగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర వైసీపీ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షుడికి ఉన్నటువంటి సంకల్పం ఇది. ఈ సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలోని 2516 గ్రామాల మీదుగా  కొనసాగుతూ వచ్చింది. తాడిత పీడిత  పేద బలహీన వర్గాల  కష్టాలు వినేందుకు భజన లోకి వచ్చారు జగన్. ఆనాడు ఆయన అన్ని కష్టాలు తెలుసుకున్న వ్యక్తి లా ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించి చివరికి బంపర్ మెజారిటీతో ఆయన ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడానికి ఈ పాదయాత్ర ఎంతో  అంది వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: