కార్పోరేషన్ లోని 6 డివిజన్ కు వైసిపి అభ్యర్థి ఎంపీకపై పార్టీ లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గం లోని 6 డివిజన్ కు స్దానికేతురుడు కు టికెట్ ఇచ్చారని స్థానిక పార్టీ కేడర్ రగిలి పోతోంది. అక్కడ నుంచి వైసిపి అభ్యర్థి గా ఆత్మకూరి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ మారి వైసీపీ చెంత చేరిన పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి టికెట్ అమ్ముకన్నాడని కర పత్రాలు వెలు వడుతున్నాయి.
వైసిపి పార్లమెంట్ జాయింట్ సెక్రటరీ గుజ్జుల రామకృష్ణ రెడ్డి పేరుతో ఈ కర పత్రాలు నగరం అంతటా వ్యాప్తి చెందుతున్నారు. ఇక గతంలో ఇక్కడ కార్పోరేటర్ గా గెలిచిన పాదర్తి రమేష్ గాంధీని మానసికంగా టార్చర్ పెట్టి ఆయన మృతి కి కారణమయ్యారని ఎమ్మెల్యే గిరి ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక మేయర్ పదవి కోసం గాంధీ నుంచి ఎమ్మెల్యే గిరి రు. 4 కోట్లు వసూలు చేశాడన్న ఆరోపణలు కూడా వారు చేస్తున్నారు.
ఇక ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులకు కాకుండా పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తికి కార్పోరేటర్ సీటు అమ్ముకున్నాడంటూ ఆ కరపత్రాల్లో ఆరోపిస్తున్నారు. గిరికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈటల లా గెలవాలని సవాళ్లు రువ్వుతున్నారు. ఏదేమైనా ఇది ఇప్పుడు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.