పాదయాత్ర.. ఈ పదం వింటే టక్కున గుర్తొచ్చేది జగన్.. అవును..  జగన్ చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. 341 రోజుల పాటు ఏకంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఎవరూ చేయని సాహసం, తొలిసారిగా రాష్ట్రంలో జగన్ చేశాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా ధైర్యంతో అడుగులు వేశారు. ఇప్పుడు అలాంటి యాత్రలు చేసే ధైర్యం ఎవరికైనా ఉందా.. అంటే లేదనే సమాధానం వస్తుంది. దాదాపుగా ఎవరూ అలాంటి సాహసం చేయరేమో.  ఏడాదిపాటు కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజల కష్టాలను తెలుసుకోవడమూ కుదిరేపని కాదు.

నేటితరం రాజకీయ నాయకులు మాటలకే పరిమితమవుతారు. పార్టీ కార్యక్రమాలంటే ఓ అరగంటో, గంటో ఉపన్యాసం ఇచ్చేసి ఎంచక్కా కారులో వెళ్ళిపోతారు. ఏ కష్టం లేకుండా ఆందోళనలు చేస్తారు, మందీ మార్బలంతో ఇబ్బంది లేకుండా మీడియాకు ఫోజులిచ్చేసి వెళ్లిపోతుంటారు. కానీ జగన్ పాదయాత్ర అలా కాదు.. పాదయాత్రలో అడుగడుగునా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు. మరెన్నో అవరోధాలు.. ఇవన్నీ దాటుకుంటూనే వెళ్లారు జగన్. మండే ఎండల తీవ్రతను లెక్కచేయలేదు. భారీ వర్షాలు ఎదురైతే బెదిరిపోలేదు.. భారీ వర్షంలోనూ తడుస్తూ ముందుకు కదిలిన జగన్ ఇప్పటికీ గుర్తుండే ఉంటారు. వణికించే చలికాలంలోనూ పాదయాత్ర చేస్తూ జగన్ ముందుకే నడిచారు.

జగన్ పొద్దున్నే పాదయాత్ర మొదలు పెట్టి.. సాయంత్రానికి ముగించేసి ఇంటికెళ్ళలేదు. దాదాపుగా సంవత్సర కాలం పాటూ భార్యా, బిడ్డలకు దూరంగా ఉన్నారు. కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలే తన కుటుంబంగా మెలిగారు. జనం మధ్యే అడుగు మొదలు పెట్టి.. జనం మధ్యే జగన్‌ విడిదిచేశారు. జనంతోనే కలిసి తిన్నారు. జనంతోనే కలిసి పడుకున్నారు. కింది స్థాయి కార్యకర్తల నుంచి.. నాయకుల వరకూ ఎక్కడికక్కడే సమాలోచనలు జరిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ముందే.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఇదంతా చేయాలంటే ధైర్యం కావాలి. దమ్ము ఉండాలి. ఏదిఏమైనా సాధించాలనే తపన, పట్టుదల కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టే.. జగన్ జననేత అయ్యారు. ఆయనలాగా పాదయాత్ర చేసే సాహసం సమకాలీన రాజకీయాల్లో ఇంకెవరూ చేయరేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: