కుర్రకారుకు బైక్ చూస్తే మనసు ఆగదు. దాన్ని తీసుకొని రయ్ రయ్ మని చక్కర్లు కొట్టేయాలనిపిస్తుంది. వెడల్పాటి రోడ్లమీద గాల్లో తేలిపోయేలా రైడ్ చేయాలని ఉంటుంది. ఎలాంటి ప్రమాదం జరుగకుండా సేఫ్ గా వెళ్లాలని అందరూ కోరుకుంటారు. కానీ జరగరానిది ఏధైనా జరిగితే అటు వాళ్ల తల్లి దండ్రులకు తీరని శోకం మిగులుతుంది. అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అతి వేగం ప్రాణానికే ప్రమాదమంటూ పోస్టర్లు పెడతారు. ఇంత స్పీడ్ లో వెళ్లాలనే రూల్ ను కూడా పెడతారు. అయితే ఒక వేళ ఆ నిబంధనలు పట్టించుకోకుండా దూసుకెళ్తే మాత్రం బైక్ ను పట్టుకొని కేసు నమోదు చేస్తారు. ఆ బైక్ ను సీజ్ చేసి స్టేషన్ కు తరలిస్తారు. కొందరు పోలీసులైతే ఫైన్ కట్టి వదిలేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోతే మాత్రం ఆ బండిని రోడ్డెక్కనీయకుండా చేస్తారు.

అదే విధంగా తాగి బైక్ నడిపేవారి విషయంలో కూడా పోలీసులు ఇలాంచి చర్యలే తీసుకుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడికక్కడ బారీకేడ్లు పెట్టి బైక్ లు ఆపేస్తారు. మందు తాగే వాళ్లను గుర్తిస్తారు. వాళ్లుఎంతమొత్తంలో తాగారో గుర్తించి.. ఫైన్ వేస్తారు. అంతేకాదు బైక్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. ఇలా.. బైక్ పోలీస్ స్టేషన్ లలో దుమ్ము పట్టి పోతుంటాయి. ఎంతో కష్టపడి కొనుక్కున్న బైక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కనిపిస్తుండటంతో వారు తెగబాధపడిపోతుంటారు. ఎలాగైనా ఆ బైక్ తమ దగ్గరకు వస్తే బాగుండని అనుకుంటుంటారు. కొద్ది రోజుల పాటు స్టేషన్ ల చుట్టూ తిరిగి మరిచిపోయిన సందర్భాలూ ఉంటాయి.

ఇక తెలంగాణ హైకోర్టు వాహనదారులకు ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఇకపై వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ తీర్పునిచ్చింది. అంతేకాదు పోలీస్ స్టేషన్ లలో దుమ్ముపట్టిపోతున్న వాహనాలను తిరిగి వాళ్లకు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తాగిన వారిపై కేసులు పెట్టొచ్చు కానీ.. వాహనాలను సీజ్ చేయొద్దని సూచించింది. అలాంటి సందర్భంలో ఆ వాహనాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పజెప్పాలని తెలిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: