అయితే ఇటీవలి కాలంలో చైనా మరింత బరితెగించి అన్న విషయం తెలిసిందే. ఏకంగా తైవాన్ గగనతలంలో కి యుద్ధ విమానాలను పంపించడం సంచలనంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అటు అమెరికా పలుమార్లు చైనా కు వార్నింగ్ కూడా ఇచ్చింది. తైవాన్కు తాము అండగా ఉంటామని చైనా వెనక్కి తగ్గితే బెటర్ అంటూ సూచించింది. చైనాతో ప్రత్యక్ష యుద్ధం కోరుకోవడం లేదు అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. అయినప్పటికీ అటు చైనా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో చైనా ఇలాగే బరితెగించి ముందుకు సాగి తైవాన్ ను ఆక్రమించుకుంటే ప్రపంచ దేశాలు చైనాతో యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే జరిగితే అటు చైనా భారత్ కి గిఫ్ట్ ఇచ్చినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే చైనా కరోనా వైరస్ ను పుట్టించింది అనే కారణంతో చైనా నుంచి బయటికి వచ్చి ఎన్నో కంపెనీలు భారత్ లోకి వచ్చేశాయి. ఇలా భారత్కు కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు చైనా తైవాన్ ను ఆక్రమించుకుంటే ప్రపంచ దేశాలు చైనాపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అన్ని కంపెనీలు చైనా నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక చైనా కంటే ఎక్కువగా మౌలిక వసతులు మానవ వనరులు ఉన్న దేశం భారత్. దీంతో భారత్ లోకి వచ్చే అవకాశం ఉందని ఇలా చైనా బరితెగింపు భారత్కు గిఫ్ట్ కాబోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.