ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అన్ని దేశాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి విపత్తు ఎదుర్కొనేందుకు దిశానిర్దేశం చేయాలి. ప్రపంచ దేశాల పక్షాన మాట్లాడాలి. కానీ ఏ ఒక్క దేశం పక్షాన మాట్లాడకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వ్యవహరించిన తీరు అంతకన్నా ఎక్కువ చర్చనీయాంశంగా మారి పోతూనే ఉంది. అసలు కరోనా వైరస్ నిజాలు బయటకు రాకుండా చైనాకు సహకరించింది.


 అయితే అగ్రరాజ్యాలకు ఎప్పుడు సహకరించే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశంగా ఉన్న భారత్ విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తూ ఉంటుంది.అయితే సరైన క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుకొని అటు చైనా, రష్యా లాంటి వ్యాక్సిన్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. కానీ అటు భారత్లో తయారు చేసిన కొన్ని టీకాకు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వలేదు. దాదాపు 16వారాల పాటు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తాము ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గమని.. ప్రపంచ ప్రజానీకం క్షేమమే మాకు ముఖ్యం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పింది..


 విదేశాలు స్వయంగా భారత వ్యాక్సిన్ నమ్మి కొనుగోలు చేస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా భారత వ్యాక్సిన్ విషయంలో  చిన్న చూపు చూసి నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇటీవలే అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ వ్యాక్సిన్ కు మాత్రం వెంటనే అనుమతి ఇవ్వడం గమనార్హం. చిన్న పిల్లల కోసం ఇటీవల ఐదు సంస్థ ఒక వ్యాక్సిన్అనుమతి కోసం  కోరగా ఎలాంటి ఆలస్యం లేకుండా టీకాకు అనుమతి ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ . ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అగ్రరాజ్యాలకు బానిస గా మారి పోయిందిఅంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wjo