నేను రైతాంగానికి చెప్తున్నా
ఈ బండి సంజయ్ సొల్లు కబుర్లను నమ్మి , పనికి మాలిన మాటలను నమ్మి. వరి పంటను గనుక వేస్తే పూర్తిగా దెబ్బతింటం. తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట అనేది మనకు క్షేమదాయకం కాదని. ధాన్యం తీసుకోవాల్సిన కేంద్రం చేతులు ఎత్తేసిందని . మేము తీసుకోమని నిరాకరిస్తున్నదని అన్నారు.ధాన్యం సంగతి ఏందో తేలుస్తామని. కేంద్ర ఆహారశాఖ మంత్రిని డిమాండ్ చేస్తు ఉన్న ధాన్యం విషయములో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలి. తెలంగాణ రైతాంగాన్ని మీరు మోసం చేస్తే ఊరుకునేది లేదు.
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఉత్తర భారతంలో కొట్లాడుతున్నటువంటి రైతన్నలకు అండగా మీము ఉంటామని, తాము కూడా ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు మేం కూడా పెడుతం ధర్నాలు. ఉత్తర భారతంలో రైతులు ఎవరైతో కొట్లాడుతు ఉన్నరో వారికి అండగా ఉంటాం. రైతు వ్యతిరేక చట్టాలను మొత్తం వెనక్కి తీసుకోవాలె. ధర్నా చేస్తం. సీరియస్‌గానే కొట్లాడుతం. డీజిల్, పెట్రోల్ మీద పెంచినటువంటి సెస్‌లు వెంటనే విరమించుకోవలె. మిమ్ముల్ని పండనియ్యం అని చెప్పారు.
వ్యవసాయ రంగంపై కుట్ర జరుగుతోందని
రైతు ఆయన పొలంలో అతను జీతగాడిగా పనిచేయాలా..? వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే కుట్ర కూడా జరుగుతున్నదని ఈ యొక్క కుట్రలను ఛేదిస్తాం. కుట్రలను బయటపెడతాం. దీనిపై పార్లమెంటు దద్దరిల్లేలా కూడా చేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడతాం. ధాన్యం కొనుగోళ్ల సంగతి కూడా పార్లమెంటులో ఉంచుతాం. మా రాష్ట్రనికి వచ్చే కోటా ఏందో నిర్ణయించాలని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేస్తం. 2,600 రైతు వేదికలలో ధర్నాలు చేస్తాం. అవసరమైతే నాతో సహా మొత్తం తెలంగాణ కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ప్రజాప్రతినిధులం పోయి అక్కడ వడ్లు కొనాలని ఢిల్లీలో ధర్నా పెడతాం. పంజాబ్‌లో మాత్రం ధాన్యం 100 శాతం సేకరిస్తరంట. మరి తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు..? మొదట దీనికి మీరు సమాధానం చెప్పాలి. కేంద్రప్రభుత్వానికి ఒక్కో రాష్ర్టానికో నీతి ఉంటదా..? కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మొత్తం ధాన్యాన్ని సేకరించాలి. తెలంగాణలో ప్రొడక్టివిటీ ఇంకా ఎక్కువ. దేశానికి నేడు తెలంగాణ అన్నం పెడుతు ఉన్నది. ఇది చూసి మీకు కండ్లు మండుతున్నయ్. తెలంగాణ రైతన్నలు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. పిచ్చి ప్రయోగాలను మానుకొని, జాగ్రత్తగా వ్యవహారం చెయ్యాలి.