కేసీఆర్ ఇటీవల మళ్లీ బీజేపీపై యుద్ధం ప్రారంభిచారు.. సమర శంఖం పూరించారు. ఇన్నాళ్లూ ఎందుకులే కొత్త రాష్ట్రం కదా అని ఆగాం.. ఇక సహించేది లేదంటూ రంకెలు వేస్తున్నారు. తెలంగాణలో పండి వడ్లన్నీ కొంటారా లేదా.. తేల్చి చెప్పండి.. అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు..  పెట్రోల్ సెస్ తగ్గిస్తారా.. తగ్గించరా.. పెట్రోల్ రేటు రూ. 70కు తీసుకొస్తారా లేదా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఇప్పుడే కేసీఆర్ ఎందుకు బీజేపీపై విరుచుకుపడుతున్నట్టు.. ఈ ప్రశ్నకు మాత్రం చాలా మంది వద్ద సమాధానం లేదు..


అయితే.. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పరాజయం అంశాన్ని జనం మనస్సు నుంచి తొలగించేందుకే కేసీఆర్ ప్రగతి భవన్‌ లో వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడని చాలా మంది భావించారు. అయితే.. అసలు కథ వేరే ఉందంటున్నారు ఇంకొదరు. అదేంటంటే.. ప్రస్తుతం తెలంగాణలో పుష్కలంగా వరి పంట పడింది. వరి కళ్లాల నిండా ధాన్యపు రాశులు ఉన్నాయి. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కొంటున్నా అరకొర మాత్రమే కొంటున్నారు. మరోవైపు ధాన్యపు రాశులపైనే కొందరు రైతులు ప్రాణాలు విడుస్తున్నారు.


వాస్తవానికి ఈ వడ్లు కొనాల్సింది కేంద్రమే.. కానీ.. ఆ విషయం సాధారణ రైతుకు పెద్దగా పట్టదు.. గతంలో కేసీఆర్ పండిన ప్రతి గింజా కొంటా అంటూ ఎన్నోసార్లు చెప్పారు.. ఇప్పుడు కొనకపోతే.. ఆ  ఆగ్రహం ముందు స్థానిక సర్కారుపై ఉంటుంది. అంతే తప్ప.. ఇదంతా కేంద్రం వల్ల అని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే అన్నదాతల ఆగ్రహం పెరగక ముందే.. కేసీఆర్ కేంద్రాన్ని  టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీని వల్ల.. ముందుగా కేసీఆర్ సర్కారుపై రైతుల్లో  ఉన్న కోపం  అవుతుంది. మన కోసం కేంద్రాన్ని నిలదీస్తున్నాడన్న భావన వస్తుంది. అదే సమయంలో కేంద్రం కూడా ఆత్మ రక్షణలో పడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కట్లలో పడుతుంది. ఇదీ కేసీఆర్ రెండంచెల వ్యూహం. అలా కేసీఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్ని కొట్టేస్తున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: