ఇక్కడ టీడీపీ నాలుగుసార్లు మాత్రమే గెలిచింది. 1985, 1994, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే మూడుసార్లు యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలుస్తూ వచ్చారు. కమ్మ వర్గానికి చెందిన యరపతినేని ఊహించని విధంగా గురజాలలో బలపడ్డారు. దీంతో ఆయనకు చెక్ పెట్టడం అంత సులువు కాదని అంతా అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఊహించని విధంగా యరపతినేనిపై కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా గెలిచాక గురజాలలో కాసు హవానే నడుస్తోంది. ఏ మాత్రం యరపతినేనికి ఛాన్స్ ఇవ్వకుండా కాసు దూసుకెళుతున్నారు. ఇప్పటికే పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో యరపతినేనికి చెక్ పెట్టారు. అలాగే పిడుగురాళ్ల మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ చేశారు. ఈ మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క వార్డు రాలేదు. ఇక తాజాగా జరిగిన గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కాకపోతే దాచేపల్లిలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ 20 వార్డులు ఉంటే వైసీపీ 11, టీడీపీ 7, జనసేన 1, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు. అంటే ఎడ్జ్‌లో దాచేపల్లిని వైసీపీ కైవసం చేసుకుంది.
అటు గురజాలలో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. 20 వార్డుల్లో వైసీపీ 16, టీడీపీ 3, జనసేన 1 చోట విజయం సాధించింది. అంటే ఇలా ప్రతి ఎన్నికల్లోనూ గురజాలలో వైసీపీ హవా నడిచింది. ఇదే హవా నెక్స్ట్ ఎన్నికల వరకు కంటిన్యూ అయితే మళ్ళీ యరపతినేనికి కాసు గెలిచే ఛాన్స్ ఇవ్వకపోవచ్చని చెప్పొచ్చు.