రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు జనరేషన్ మారే కొద్దీ రాజకీయ నేతలు తమ పంథాను కూడా మార్చుకుంటూ ముందుకు పోవాలి. కేవ‌లం రాజ‌కీయాల్లో మాత్ర‌మే కాదు... ఏ రంగంలో అయినా.. ఎక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎప్పుడో ఉన్న పార్టీకి పునాదులు ఏర్పరిచిన నేతలను ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటూ వ‌స్తున్నా  ఫలితం ఉండదు. వారినే ఎప్పుడూ స్మ‌రించు కుంటూ వ‌స్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇది దేశ రాజకీయాల తో మొద‌లు పెడితే నేటి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయా ల‌ వరకూ పనిచేస్తుంది. అది సదరు చరిష్మా కేవ‌లం కొద్ది సంవ‌త్స రాలు మాత్ర‌మే ఉంటుంది. అది ఏ పార్టీకి అయినా కావ‌చ్చు.

ఇంకా ఇందిర‌మ్మ కాలం నాటి రాజ‌కీయాలు చేస్తూ.. వారి పేరునే వాడుకుంటే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో ఇప్ప‌టి కాంగ్రెస్ దుస్థితి చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కే వ‌లం మూడు అంటే మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఈ ఓట్ల‌ను చూసి షాక్ అయ్యి అస‌లు ఇందిరమ్మ ఓట్లన్నీ ఎటుపోయయని అమాయకంగా మొఖం పెట్టుకుని ప్ర‌శ్నించారు.

ఇక ఇప్పుడు ఏపీ లోనూ చంద్ర‌బాబు ప‌దే ప‌దే పార్టీ వ్య‌వ‌స్థాప కులు ఎన్టీఆర్ ను పట్టుకుని ముందుకు వెళుతున్నారు. చంద్ర‌బాబు కు వ‌య‌స్సు పై బ‌డింది. ఆయ‌న కు ఎన్టీఆర్ రేంజ్ ఇమేజ్ , బ్రాండ్ రెండూ లేవు. అందుకే అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న ఎన్టీఆర్ పేరు పైకి తెస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు జ‌న‌రేష‌న్ లో చాలా మందికి ఎన్టీఆర్ గురించి తెలియ‌దు.. ఈ త‌రం జ‌న‌రేష‌న్ కు ఎన్టీఆర్ అంటే కేవ‌లం జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తుంటారు. అందుకే బాబు ఇప్ప‌ట‌కీ అయినా ఎన్టీఆర్ ఛ‌రిష్మానే ఇంకా న‌మ్ముకుని రాజ‌కీయం చేయ‌డం మానేసి టీడీపీ కొత్త ఓటు బ్యాంకు ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: