మన భారత దేశ ప్రజల్లో భావోద్వేగాలు చాలా బాగా పనిచేస్తాయి. ఎవరికైనా అన్యాయం జరిగింది... అన్నదానిపై ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఏర్పడితే వారిని ఎవరు ఆపలేరు. ఇక రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు ఎన్నో సార్లు సక్సెస్ అయ్యాయి. తెలుగు గడ్డపై సైతం ఈ భావోద్వేగాలు ఎంతోమందిని హీరోల‌ను చేశాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు ఈ భావోద్వేగాలు ఆయన ను తొలిసారి ముఖ్యమంత్రి ని చేశాయి.

తర్వాత పరిణామాలతో ఆయన 1985 లో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ సెంటిమెంట్ తోనే 1994 లో తిరుగులేని మెజారిటీతో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ పాదయాత్ర సెంటిమెంట్ గా పనిచేసి తెలుగు ప్రజలు ఆయన్ను బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసేందుకు కారణం అయ్యింది. ఆ తర్వాత చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో పాటు ఆయన చేసిన మీకోసం పాదయాత్ర మరోసారి ఆయన 2014లో సీఎం చేసింది. తండ్రి మరణంతో పాటు ఆయన చేసిన పాదయాత్ర జ‌గ‌న్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.

ఇప్పుడు చంద్రబాబు జరిగిన దారుణ పరాభవం కూడా సెంటిమెంట్ గా మారితే... ఇది ఏపీ ప్రజల్లో ఓ బలమైన భావోద్వేగం గా మారితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఎవరు ఆపలేరు అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. చంద్ర‌బాబు కూడా తాను ఇక పై అసెంబ్లీ లో అడుగు పెట్ట‌ను అని.. తాను ముఖ్య మంత్రి అయ్యాకే తిరిగి అసెంబ్లీ లో అడుగు పెడ‌తాన‌ని భీష్మ ప్ర‌తి జ్ఞ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌జా దీవెన యాత్ర‌కు రెడీ అవుతున్నారు. బాబు భీక‌ర ప్ర‌తిజ్ఞ నేప‌థ్యంలో 2024 లో ఏం జ‌రుగుతుంది ? మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: