బాధపడ్డ బాబు, హ్యాపీ గా ఉందన్న రోజా, సందిగ్ధంలో టిడిపి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బోరున విలపించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో పరిణామాలపై మనస్తాపానికి గురైన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చి పాలిటిక్స్ లోకి తన  భార్యను లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపధం చేశారు చంద్రబాబు. ఆ ధర్మంపై ప్రజా క్షేత్రంలోని పోరాడతానన్నారు. ధర్మాన్ని గెలిపించాలా,అధర్మాన్ని గెలిపించాలా అనేది ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని అప్పటి వరకు వెళ్లనని శపధం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీలో రాక్షస పాలన కు మించి దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. వైసిపి పాలనలో అసెంబ్లీ గౌరవ సభల కాకుండా, కౌరవసభల మారిందని మండిపడ్డారు.

 చంద్రబాబు డ్రామాలను ప్రజలు చూస్తూ ఉన్నారని అన్నారు సీఎం జగన్. ప్రతి దాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న జగన్ ఆయన ప్రస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎక్కడ మాట్లాడలేదన్న జగన్ తమ కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించానని చెప్పారు. చంద్రబాబు ఆవేశంతో కాదు ఒక రోజంతా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు సతీమణినో,మరొకరినో ఒక మాట అంటే ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకునే వ్యక్తి చంద్రబాబు కాదు అన్నారు. రాజకీయంగా లాభనష్టాలపై పక్కా స్ట్రాటజీ తోనే వెళ్లిపోవాలని అనుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏడుపుతో తాను చాలా హ్యాపీ అయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇది ఎవరిని వదిలిపెట్టదని చంద్రబాబు తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులు ప్రజలు నమ్మరు,పట్టించుకోరు అన్నారు. తన భార్యని అన్నారని తెగ ఫీల్ అయిపోతున్నారని అధికారంలో ఉండగా ఎందరిని ఏడిపించారో మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరం అన్నారు పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యులను కించపరచడం తగదంటూ లేఖ విడుదల చేశారు. టిడిపి నేతలు అసెంబ్లీ కి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు.నాటకీయ పరిణామాల తర్వాత టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.ఈ అసెంబ్లీ సమావేశాలను టిడిపి బై కట్ చేయగా భవిష్యత్తులో అసెంబ్లీ కి వెళ్లాలా వద్దా అన్నదానిపై చర్చించారు. మరొకసారి టిడిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి  నిర్ణయం తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: