తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు... అంటూ ఓ వార్త సమాజిక మాధ్యమాలమల్లో హల్ చల్ చేసింది. సాధారణంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంది పుచ్చుకుంది. పార్టీ మీడియాకు ఉప్పందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి టిఆర్ ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. 12 స్థానాలకు గాను 13 మంది పేర్ల ప్రచారంలోకి వచ్చాయి. దీంతో కొంత అనిశ్చితి నెలకొంది.
కరీం నగర్ నుంచి ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు, నల్లోండ జిల్లా నుంచి ఎం.సి . కోటి రెడ్డి, మెదక్ జిల్లా నుంచి యాదవ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మహేందర్ రెడ్డి, ఎస్. రాజు, మహబూబ్ నగర్ నగర్ నుంచి సాయిచంద్, కె. నారాయణ రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం. అదే విధంగా..అదిలాబాద్ నుంచి దండే విఠల్, ఖమ్మం నుంచి తాతా మధు పేర్లు జాబితా ఉన్నట్లు టిఆర్ ఎస్ శ్రేణులు తెలిపాయి. నిజామాద్ జిల్లా నుంచి ఎవరి పేరు జాబితా చోటు చేసుకుంటుదో మాత్రం వెల్లడించ లేదు. అక్కడి నుంచి రెండు పేర్లు వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత కాని, ఆకుల లలిత కాని పోటీ చేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని వీడి టిఆర్ ఎస్ లో చేసిన ఎల్ . రమణకు ఎం.ఎల్ సి బెర్త్ ఖాయమని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. టిఆర్ఎస్ లోని పాత తెలుగు తమ్మళ్లందరూ ఎల్ రమణ కోసం లాబీయింగ్ చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణలు చాలా కాలం నుంచి బహిరంగంగానే పేర్కోంటున్నాయి. అదిలా బాద్ జిల్లా నుంచి ప్రస్తుతం శాసన మండలిలో ఉన్న నేత సతీష్. తిరిగి ఆయనకే మరలా టికెట్ వస్తుందని అందరూ భావించారు. కానూ అనూహ్యంగా విఠల్ పేరు జాబితా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే విధంగా నిజామాబాద్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారని పార్టీ శ్రేణలు తెలిపాయి. లేని పక్షంలో ఆకుల లలిత బరిలో ఉంటారని కూడా ప్రకటించేశాయి. కవితకు రాజ్యసభ బెర్త్ ఖరారు చేశారని, కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆయన తరపున కవితను ఢిల్లీకి పంపనున్నారని టిఆర్ ఎస్ లోని ఒక వర్గం పేర్కోంది. ఏది ఏమైనా సస్పేన్స్ వీడాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.