అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే వరద ప్రభావం తగ్గి ఇక సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇటీవల సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇక వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే తిరుపతిలోని రాయల చెరువు సమీపంలో వరద ముప్పు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగారు.
వరద బాధితులకు నిత్యావసరాలు అందించడం కోసం హెలికాప్టర్ లో పది టన్నుల నిత్యావసర సరుకులు వస్తే.. అయితే ఈ సరుకులను స్వయంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి వరద బాధితులకు అందజేశారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా నిత్య అవసరాలు అందక ఆకలితో అలమటించే కూడదని ఏ ఒక్కరికి ప్రాణహాని కాకూడదు అని జగన్ ఆదేశాలు జారీ చేశారని సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాము అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు.