ఇక నందలూరు దగ్గర బ్రిడ్జిపై నుండి వెళుతున్న నాలుగు బస్సులు ముంపునకు గురయ్యాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారనీ.. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల్లో కార్తీక మాసం సందర్భంగా కొందరు పూజలు చేస్తుండగా ప్రమాదానికి గురైయ్యారని చెప్పారు. ఈ రెండు ఘటనల్లో 20మంది వరకూ గల్లంతై.. మరణించారని చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచే అన్ని గ్రామాల్లో తాగునీరు, ఆహరం అందించామని స్పష్టం చేశారు సీఎం జగన్. శనివారం ఏరియల్ సర్వేద్వారా ముంపు ప్రాంతాలను చూశామన్నారు. ఎప్పటికప్పడు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు చెప్పారు.
తాను గాలిలోనే వచ్చి గాలిలోనే పోతాననీ ప్రతిపక్ష నేతలు అంటున్నట్టు చెప్పారు సీఎం జగన్. ఎక్కడో ఓ చోట కనుమరుగు అవుతాననీ.. తనను వ్యతిరేఖించిన వైఎస్ఆర్ కాలగర్భంలో కలిసి పోయారని అంటున్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి సంస్కానికి నమస్కారాలు అన్నారు సీఎం. కడప మీద తనకు మరికొంత ఎక్కువగానే ప్రేమ ఉందనీ.. తాను వెళ్దాం అనుకుంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని సీనియర్ అధికారులు సలహా ఇచ్చినట్టు చెప్పారు. ఇపుడు వరద బాధితులను ఆదుకోవడం చాలా ముఖ్యమన్నారు. మంత్రులు, అధికారులను సహాయక చర్యల్లో నిమగ్నం చేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వెళితే వరద బాధితులను అధికారులు వదిలేస్తారని అభిప్రాయ పడ్డారు సీఎం జగన్. సహాయ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలకు తాను వెళ్తున్నట్టు చెప్పారు సీఎం జగన్. నిధులకు ఎక్కడా కొరత రాకూడదని 84 కోట్లు నాలుగు జిల్లాలకు ఇచ్చినట్టు చెప్పారు. బాధితుల కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సాయంగా 2 వేల రూపాయలు, బియ్యం, నిత్యావసరాలు ఇచ్చామన్నారు. వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని కూడా శరవేగంగా అందించినట్టు చెప్పారు. గల్లంతై ఆచూకీ లభ్యం కానీ వారి విషయంలోనూ పరిహారాన్ని అందించామన్నారు.