కానీ 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల బాబుకు డ్యామేజ్ జరిగింది..చాలా చోట్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది. ఒకవేళ ఇద్దరూ కలిసిపోటీ చేస్తే...గెలవకపోయినా కనీసం గట్టి పోటీ ఇచ్చేవారు. అయితే ఈ సారి జగన్‌కు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే పవన్‌తో కలవాల్సిందే అని బాబు గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక బీజేపీ కలిసొస్తే ఓకే లేకపోతే పవన్, వామపక్షాలతో కలిసి బాబు ముందుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇదే సమయంలో జనసేనతో పొత్తు వల్ల వచ్చే లాభ నష్టాలపై టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సంఖ్యలో సీట్లు ఇస్తే ఇబ్బంది లేదని, అలా కాకుండా ఎక్కువ సీట్లని ఇస్తే చిక్కుల్లో పడక తప్పదని తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఎక్కువ సీట్లు ఇస్తే...ఎక్కువ మంది టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్తితి. అలా కొన్ని నియోజకవర్గాలు జనసేన చేతుల్లోకి వెళితే టీడీపీ మనుగడకు ఇబ్బంది. అదే సమయంలో జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ ఓటర్లు...జనసేనకు మద్ధతు ఇస్తారు.
కానీ టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో జనసేన ఓటర్లు ఎంతవరకు మద్ధతు ఇస్తారనేది డౌట్‌గా ఉందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అదే జరిగితే టీడీపీ అన్నిరకాలుగా నష్టపోవడం గ్యారెంటీ అని అంటున్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరగడం ఖాయమే. మరి పొత్తు విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.