ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. అయినా కూడా యువ‌త‌లో మార్పు తీసుకువ‌చ్చే చ‌ర్య‌లేవీ అటు త‌ల్లిదండ్రులుకానీ ఇటు విద్యా సంస్థ‌లు కానీ చేప‌ట్ట‌డం లేదు. మాద‌క ద్ర‌వ్యాలు, చెడు అల‌వాట్లు కార‌ణంగా ఎవ‌రికి వారు త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకుని తుద‌కు బల‌వన్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ వైఖ‌రికి గ‌డిచిన కొన్నేళ్లుగా పెరుగుతూ పోతోంది.

జీవితం చిన్న‌ది య‌వ్వ‌నం కూడా చిన్న‌దే కానీ య‌వ్వ‌నాన్ని సంబంధిత కాలాన్ని దుర్వినియోగం చేయ‌డంలో యువ‌త ముందుంటున్నారు. అస‌లు సిస‌లు పార్టీ క‌ల్చ‌ర్ కు అల‌వాటు పడి జీవితాల‌ను నాశనం చేసుకుంటున్నారు. మాద‌క ద్ర‌వ్యాలకు అల‌వాటు ప‌డి చ‌దువుకున్న రోజుల్లోనే పెడ‌దోవ‌ప‌డుతున్నారు. ఇదేంట‌ని అడిగిన త‌ల్లిదండ్రులకు చుక్క‌లు చూపిస్తున్నారు. పోలీసు స్టేష‌న్ల‌లో కేసులు కూడా ఇదేవిధంగా ఉంటున్నాయి. కొంద‌రు యువ‌త గ్రూపుగా ఏర్ప‌డి మాద‌క ద్ర‌వ్యాల వినియోగానికి ర‌వాణాకు సహ‌క‌రిస్తుండ‌డం బాధాక‌రం.  

చావు బ‌తుకుల కొట్లాట‌లో యువత న‌లిగిపోతోంది.  చిన్న వ‌య‌సులోనే మాద‌క ద్ర‌వ్యాల‌కు, మ‌త్తుకు బానిస అవుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో త‌ల్లిదండ్రులు త‌మ పిల్లల భవిష్య‌త్ పై ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా చెడు తోవల్లో న‌డుస్తూ విలువ‌యిన భ‌విష్య‌త్ ను తాకట్టు పెడుతూ త‌మ‌ని తాము ప‌త‌నం చేసుకుంటున్నారు. ఈ ద‌శ‌లో త‌ల్లిదండ్రులు కానీ  లేదా విద్యా సంస్థ‌లు కానీ అప్ర‌మ‌త్తం కావాల్సిందే. ఏటా ఆత్మ‌హ‌త్య‌ల సంఖ్య‌, మ‌త్తుకు బానిసలుగా మారి బ‌లవ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నారు.


ఈ ద‌శ‌లో మేల్కోవాల్సిన యువ‌త ఆ విధంగా ఆలోచించ‌క క్ష‌ణికాక‌వేశంలోనే విలువ‌వ‌యిన ప్రాణాలు కోల్పోతున్నారు. అంద‌మ‌యిన జీవితాల‌ను చీక‌టిమ‌యం చేసుకుంటున్నారు. 2014లో మ‌త్తుకు బానిస అయిన వారి సంఖ్య 97 మంది ఉండ‌గా, 2020 నాటికి మ‌త్తుకు బానిస అయిన ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారి సంఖ్య 385గా ఉంది. అదేవిధంగా ఆత్మ‌హ‌త్యల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఈ పెరుగుద‌ల అత్యంత ఆందోళ‌నక‌రంగా ఉంది. 2014లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారి సంఖ్య 6101 ఉండ‌గా, 2020 నాటికి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారి సంఖ్య 7043గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap