ఇక లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు అన్నీ భారీగా నష్టపోయాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకువస్తున్న ప్రయివేటు టీచర్లకు లాక్డౌన్ అన్నది మరో శాపంగా మారింది. దీంతో కుటుంబాలను పోషించుకోలేక చాలా మంది రోడ్డున పడ్డారు. కొందరయితే కూరగాయలు అమ్మారు. ఇంకొందరు వేర్వేరు పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకువచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇప్పటికీ పిల్లల చదువులు ఏవీ గాడిన పడలేదు. ఆన్లైన్ చదువులు అర్థం కాక,క్లాస్ రూం లో పాఠాలు విన్నంత సౌలభ్యత ఇంట్లో లేక చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు కూడా! కొన్ని చోట్ల స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని వారు అయితే అసలు పాఠాలే వినలేక చదువుల్లో ఎంతగానో వెనుకబడిపోయారు. ఇలాంటి సంక్షోభాల నుంచి ఎలా నెట్టుకు రావాలో లేదా నెగ్గుకు రావాలో తెలియక చాలా మంది గ్రామీణ విద్యార్థులు బడులకు మరింతగా దూరం అయిన సందర్భాలూ ఉన్నాయి. ఆ విధంగా డ్రాపౌట్లు పెరిగారు కూడా!