అందుకే ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్లు కూడా వేస్తున్నారు. అదే కొత్త జిల్లా ల ఏర్పాటు . ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒకటి చొప్పున 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ గత ఎన్నికలకు ముందే తాను ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రం గా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే రూట్లో జగన్ ముందుకు వెళుతున్నారు. అయితే నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు ను మాత్రం రెండు జిల్లా లు గా చేస్తున్నారు.
అరకు పార్లమెంటు ను విజయనగరం, అరకు జిల్లా లుగా విభజిస్తున్నారు. ఈ జిల్లా లకు స్థానికం గా పేరున్న నేతల పేర్లు కూడా పెట్టనున్నారు. కృష్ణా జిల్లా కు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెడతారని అంటున్నారు. ఇక ఈ కొత్త జిల్లా ల ఏర్పాటు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని కూడా జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. కొత్త జిల్లా ల ఏర్పాటు తో పరిపాల న వికేంద్రీక రణ జరిగి పాలన మరింత గా ప్రజలకు వెళ్లుతుందని జగన్ ప్లాన్. ఏదేమైనా ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.