ఇక ఇప్పుడు జమ్మల మడుగు నియోజక వర్గంలోని దేవగుడి కుటుంబంలో దేవగుడి, పొన్నపు రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉందో తెలిసిందే. ఇక ఇప్పుడు దేవగుడి కుటుంబం అంతా ఏకంగా పొన్నపురెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొంటుంది. వరసగా రెండు సార్లు గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014లో టీడీపీ లోకి వచ్చి మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత తన అన్న నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు.
గత సాధారణ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీజేపీ లోకి వెళ్లి పోయారు. అయితే ఆది అన్న నారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే చంద్రబాబు ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జిని చేశారు. అయితే అక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డితో పాటు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీ లో ఉండడంతో ఆ పార్టీ బలంగా ఉంది.
ఇక్కడ వైసీపీ ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు దేవగుడి కుటుంబం ఒక్కటి అవ్వాలి. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డి తన్న కుమారుడు భూపేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తారనే అంటున్నారు. అదే జరిగితే బీజేపీ లో ఉన్న ఆది నారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.