మొదటసారే ఛాన్స్ కొట్టేయాలని చూశారు గానీ...జగన్ యువ నేతలు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చారు. ఈ సారి మాత్రం ఈ ఇద్దరిని పక్కబెట్టేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇక వీరి ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేయడానికి రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చున్నారు. ఇప్పటికే జిల్లాలో సీనియర్‌గా ఉన్న ఆనం రామ్ నారాయణరెడ్డి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు పదవి దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి...పైగా తన సోదరుడు భార్యకు నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు.
ఆనంని సైడ్ చేస్తే...క్యాబినెట్ రేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ముందున్నారు. సర్వేపల్లి నుంచి గెలుస్తూ వస్తున్న కాకాని...నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్నారు. ఈయన పదవి ఆశిస్తున్నారు. పైగా వైసీపీ అధిష్టానం సైతం...ఈయనకు పదవి ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అటు కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం పదవిని ఆశిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన మొదట నుంచి దూకుడుగానే పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈయనొక స్ట్రాంగ్ పిల్లర్. అటు క్యాబినెట్ రేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెడ్డి ఎమ్మెల్యేల్లో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.