
రైతు ఉద్యమానికి ప్రతిపక్షాలతో పాటు ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బాహాటంగా మద్దతు పలికి తమ సహకారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలు దిగజారుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 20 21 నవంబర్ 19వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రైతులు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి జాతికి క్షమాపణ చెప్పినాడు. అంటే కేంద్ర ప్రభుత్వము కూడా రైతు ఉద్యమానికి ప్రభావితము కాక తప్పలేదు .రైతుల ఉద్యమంలోని సాధ్యాసాధ్యాలను అంతర్గత ప్రయోజనాలను అనివార్యంగా అంగీకరించక తప్పలేదు.
చట్టాల ఉపసంహరణ లోనూ చర్చ లేదు:
ప్రజాస్వామ్య విధానం అంటేనే ఇచ్చిపుచ్చుకునే విధానము, పరస్పర చర్చలు, సానుకూల వైఖరితో ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో ప్రహసనంగా భావిస్తారు. దానికి భిన్నంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నవంబర్ 29వ తేదీన తొలిరోజునే రైతు చట్టాల విరమణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లుపై ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ రైతులకు ఎంతో ప్రయోజనకరమైన చట్టాలు అని ఇవి అమలులో ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని కానీ రైతులు వ్యతిరేకిస్తున్నందున రైతులను ఒప్పించలేకపోతున్నాము కనుకనే చట్టాలను ఉపసంహరించుకుo టున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.