
ఢిల్లీకి చెందిన ప్రీతి అనే యువతి ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. అయితే ఇక తన చదువును కొనసాగించడం కోసం ప్రతిరోజూ మెట్రో ద్వారా ప్రయాణిస్తూ ఉండేది. మెట్రో ప్రయాణం ద్వారా ఎక్కువ సమయం వృధా అయ్యేది.. ఈ క్రమంలోనే స్కూటీ కావాలని అడగడంతో తల్లిదండ్రులు కొనిచ్చారు. అయితే స్కూటీ ద్వారా తనకు ప్రయాణ సమస్యలు తీరిపోతాయని భావించింది ఆ యువతి. కానీ స్కూటీ ద్వారా అసలు సమస్య మొదలైంది. ఇక అందరిలాగానే ఆ మహిళ కొనుగోలు చేసిన స్కూటీని ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ క్రమంలోనే ఆమె వాహనం నెంబర్ ప్లేట్ లో sex అనే పదం వచ్చింది.
దీంతో సదరు మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఇదే విషయంపై సదరు యువతి తండ్రి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నెంబర్ ప్లేట్ మార్చాలి అంటూ కోరాడు. కానీ అధికారులు మాత్రం కుదరదు అంటూ చెప్పేశారు . అయితే దేశ రాజధాని ఢిల్లీలో sex సిరీస్ నుంచి మొత్తం పది వేలు నెంబర్ ప్లేట్ కేటాయించామని అధికారులు తెలిపారు. ఇది పెద్ద విషయం కాదు అంటూ అధికారులు అన్నారు.. దీంతో ఆ యువతి చేసేదేమీ లేక sex అనే పేరు ఉన్న వాహనాన్ని తీసుకెళ్ల లేక చివరికి ఎప్పటిలాగానే మెట్రో లో ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం.