గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి టీడీపీని బయటపడేయటానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండున్నర ఏళ్లలో అధికార వైసీపీని తట్టుకుని పార్టీని నిలబెట్టడానికి నానా కష్టాలు పడుతూ వస్తున్నారు. అయితే కొంతవరకు పార్టీని నిలబెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అలా అని పూర్తి స్థాయిలో వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో మాత్రం చంద్రబాబు, టీడీపీని తీసుకురాలేకపోయారు.

కానీ రాను రాను ఆయన వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతున్నారు. ముఖ్యంగా ఇప్పటినుంచే ఎన్నికల హామీలని ప్రజలకు ఇచ్చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా సరే బాబు...వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్తితి వచ్చింది. ఆ నిర్ణయాల విషయంలో బాబు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకెళుతున్నారు. ఇటీవల జగన్ ప్రభుత్వం..జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో...1983 నుంచి 2018 వరకు ఆయా ప్రభుత్వాలు...పేద ప్రజలకు కట్టించిన ఇళ్ల విషయంలో వన్ టైమ్ సెటిల్‌మెంట్(ఓటీఎస్)  పేరిట గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు రూపాయిలు చెల్లిస్తే...ఇళ్లని లబ్ది దారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెబుతున్న విషయం తెలిసిందే.

అదేంటి ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటి? పైగా ప్రభుత్వ సోమ్మే కాకుండా తమ సొంత డబ్బులు వేసుకుని కట్టిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రజలు ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది. అలా ఎదురుతిరుగుతున్న ప్రజలకు వేరే స్కీమ్‌లు ఇవ్వమని వాలంటీర్లు బెదిరించే పరిస్తితి. ఈ క్రమంలో చంద్రబాబు...ఓటీఎస్‌ కింద ఎవరూ డబ్బులు కట్టవద్దని, నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇళ్లని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెబుతున్నారు.

దీంతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడినట్లైంది. అలాగే ఇసుకని ఉచితంగా, మద్యం ధరలు తగ్గించి, మంచి బ్రాండ్లు తీసుకొస్తామని చెబితే...ఇంకా జగన్ ప్రభుత్వానికి చుక్కలు కనబడతాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి సొంత నిర్ణయాలే జగన్ ప్రభుత్వాన్ని ముంచేలా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: