ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా రోశయ్య నివాసానికి చేరుకుంటున్నారు. రోశయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.
రోశయ్య అవినీతి మచ్చలేని నిఖార్సయిన రాజకీయ నేత అని.. రాష్ట్ర చరిత్రలోనే మరే నేతకు లేని విధంగా 16 సార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్య దే అని.. ఆయన మరణం ఉమ్మడి రాష్ట్రానికి తీరని లోటు అని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక రోశయ్య మృతి పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా రోశయ్య మృతి పట్ల తమ ప్రగాడ సంతాపం తెలిపారు. ఇక ఏపీ నుంచి కూడా కొందరు మంత్రులు రోశయ్య కు సంతాపం తెలిపేందుకు బయలు దేరి వస్తున్నారు.