పటోళ్ల సబిత ఇంద్రా రెడ్డి... ప్రస్తుతం తెలగాణ లో మంత్రి. వీరిది తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్న రాజకీయ కుటుంబం. ఈమె భర్త దివంగత మాజీ మంత్రి ఇంద్రా రెడ్డి . ఉస్మానియా లా కళా శాల విద్యార్థి సంఘ నేత, ఎమర్యెన్సీ హయాంలో జైలు కెళ్లిన ఉద్యమ కారుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరితారక రామారావు పిలుపుతో 1985లో రాజకీయాలలోకి వచ్చారు. శాసన సభకు ఎన్నికై , కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత కూడా వివిధ శాఖల మంత్రిగా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు సేవ చేశారు. పటోళ్ల కుటుంబం తెలుగు ప్రజలకు దగ్గరైంది. తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిన సమయంలో ఇంద్రా రెడ్డి ఎన్.టి.ఆర్ తోనే ఉన్నారు. ఆయన మరణానంతరం లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీలో కొనసాగారు,అక్కడ ఇమడ లేక ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. 1999లో తిరిగి ఎం.ఎల్ ఏ అయ్యారు. అయితే ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన మరణించారు. రాజకీయాలలో ఆయన లోటుకు భర్తీ చేసేందుకు ఇంద్రా రెడ్డి సతీమణి సబితా ఇంద్రా రెడ్డి రాజకీయాలలో ప్రవేశించారు. ఇంద్రా రెడ్డి మరణించే నాటికి ఆమె వయస్సు కేవలం 37 సంవత్సారాలు మాత్రమే. భర్త దూరమయ్యారనే శోకంలో ఉన్న ఆమెకు నియోజక వర్గ ప్రజల నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించడం తప్పనిసరైంది. దీంతో ఆమె చేవెళ్ల నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకూ ఆమె ఒటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ లో ఆమెకు చేవెల్ల చెల్లెమ్మ అని పేరు. భారత్ లో తొలి మహిశా హోం శాఖ మంత్రిగా చరిత్ర కెక్కారు. ఆ తరువాత పటోళ్ల కుటుంబం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రా రెడ్డి మరో రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర కెక్కారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్చ్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.