
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సోకినట్లు ఒక వ్యక్తిని గుర్తించినట్లు సమాచారం. సదరు వ్యక్తిని వెంటనే శ్రీకాకుళం లోని రిమ్స్ హాస్పిటల్ లో చేర్పించినట్లు అధికారికంగా తెలుస్తోంది. అయితే ఈ వార్త తెలిసిన వారు ఇక ఏపీలో ఓమిక్రాన్ దండయాత్ర ప్రారంభమైందని అంటున్నారు. అయితే ఓమిక్రాన్ స్వస్థలమైన దక్షిణాఫ్రికా నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ అంత ప్రమాదకారి కాదని, దీని ప్రభావం ఏమిటో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం చూస్తే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి శ్రీకాకుళంలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తిపైనే ఉంది. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. ఏది ఏమైనా ఎన్ని వేరియంట్ లు వచ్చినా మీరు అంతా సక్రమంగా కరోనా నిబంధనలను పాటిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని ప్రభుత్వ అధికారులు తెలియచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఆ వ్యక్తికి ఓమిక్రాన్ ఎలా సోకింది? ఇతని ద్వారా ఇంకెవరికైనా వస్తుందా అన్న విషయాలపై దృష్టి కేంద్రీకరించారు.