అయితే ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు ఎవరు కూడా సాదాసీదాగా చేసుకోవడంలేదు. సామాన్యులు సైతం తమ పిల్లల పెళ్లిళ్లు అంగరంగవైభవంగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా స్తోమతకు మించి ఘనంగా పెళ్లి చేస్తూ ఉంటారు. సామాన్యులే ఇంత అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే ఇక ధనవంతులు గా ఉన్నవారు ఎంత  వైభవంగా పెళ్లి చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల  పిల్లలకు సంబంధించిన పెళ్లిళ్లు కన్నులపండుగగా జరుగుతూ ఉంటాయి. ఇక ఆ పెళ్లిళ్లకు చేసే ఏర్పాట్లు చూడ్డానికి కూడా రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. అంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి పెళ్లిళ్లు.



 ఇప్పటివరకు ఎంతో మంది రాజకీయ నాయకులు ఇలా తమ పిల్లల పెళ్లిళ్లు జరిగిన సమయంలో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సర్వాంగ సుందరంగా పెళ్లి వేడుకలను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఏకంగా భూమి మీద కాదు స్వర్గంలో పెళ్లి జరుగుతుందేమో అన్నట్లుగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసిన సందర్భాలు  కూడా ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులు పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన ఖర్చులు అప్పుడప్పుడూ బయటికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. కానీ ఇక్కడ ఒక మంత్రి మాత్రం తన కూతురు పెళ్లి ని ఎంతో నిరాడంబరంగా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సాధారణంగా ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు అంటే ఆయన కూతురు పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది అందరూ అనుకుంటారు. కానీ మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర  తన కూతురు వివాహాన్ని ఎంతో సాదాసీదాగా జరిపించాడు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కూతురు నటాషా కు కేవలం రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా పెళ్లి చేశాడు. ఈ వివాహానికి అటు బంధువులు కూడా ఎక్కువగా హాజరు కాలేదు. ఇరు కుటుంబాలు సహా కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇలా మంత్రి తన కూతురికి కరోనా వైరస్ నేపథ్యంలో సాదాసీదా గా పెళ్లి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: