ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవసరమైన అనుమతలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కోన్నారు. ఆహార ఉత్పత్తుల ఎగుతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) సంస్థ కార్యాలయాన్ని రాష్ట్రంలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అయితే అందులోకో ఓ తిరకాసు ఉంది.. అదేంటంటే...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పియూష్ గోయల్ కు తాజా గా లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వరి ధాన్యంతో బాటుగా కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. ఎగుమతలుకు సరిపడా పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కోంటూ ఇందుకు సంబంధించిన గణాంకాలను ముఖ్య మంత్రి తన లేఖలో పేర్కోన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో 17.84 లక్షల హోక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయని తెలిపారు. వీటి నుంచి దాదాపుగా 321.82 మెట్రిక్ హెక్టార్లకు పైగా పంట దిగుబడులు వస్తున్నాయన్నారు. ఈ పంట ఫలితాలు ఇంచు మించుగా ప్రతి ఏడాది ఓకే పరిమాణంలో ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మదనపల్లి ప్రాంతంలో టమోట విస్తారంగా సాగుచేస్తున్నారని, అదే విధంగా కడప , ప్రకాశం తదితర ప్రాంతాలలో బొప్పాయి సాగు అధికంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రతి జిల్లాలోనూ మామిడి, వివరించారు. వీటన్నింటిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని పేర్కోంటూ, జీడిమామిడి, బత్తాయి నిమ్మ సాగులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానం లోనే ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రం ఎగుమతి చేస్తున్నదని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కోన్నారు.
అయితే ముఖ్యమంత్రి ఎపెడా కార్యాలయన్ని విశాఖ పట్టణంలో నే ఏర్పాటు చేయమని పేర్కోనడం గమనార్హం. ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశ్వనగరానికి అనువైన అన్నిసౌకర్యాలూ అన్నీ అక్కడ ఉన్నాయని తెలిపారు. కొన్ని కార్యాలయాలు అక్కడి వస్తేచాలని కూడా తెలిపారు. తాజాగా ఎపెడా కార్యాలయం అక్కడే ఏర్పాటు చేయాలని కోరడం వెనుక విశాఖపట్నం పై మక్కువ ఉందనే విషయం చెప్పకనే చెప్పినట్లయింది.