ముఖ్యంగా అధికార వైసీపీలో నేతలు ఈ విషయంలో ముందున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి...ఏదొక పదవులు వస్తాయో...లేక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో...వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెగ కష్టపడుతున్నారు. జగన్ దృష్టిలో పడటానికి ఎలాంటి వివాదాల్లోనైనా తలదూర్చేలా ఉన్నారు. అయితే వివాదాల వల్ల జగన్ దృష్టిలో పడటం పక్కనబెడితే...ప్రజల దృష్టిలో నెగిటివ్ అవుతున్నారనే విషయం మాత్రం పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.
మరి కావాలని అవుతున్నారో...లేక ప్రత్యర్ధులు కావాలని చేస్తున్నారో తెలియదు గానీ...హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం ఎక్కువ వివాదాల్లోనే ఉంటున్నారు. అసలు ఈయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే...వివాదాల ద్వారానే చెప్పాలి. టీడీపీ హయాంలో ఈయన పోలీసుగా ఉంటూ జేసీ దివాకర్ రెడ్డితో కయ్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కయ్యం పెట్టుకునే...గత ఎన్నికల్లో ఉద్యోగం వదిలేసి మరీ...వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
పోనీ ఎంపీగా గెలిచి ప్రజల కోసం ఏమన్నా చేస్తున్నారా అంటే..ఆ విషయాలు మాత్రం కనిపించడం లేదు. కానీ ఈయన ఎప్పుడు ఏదొక వివాదంలో ఉండే విషయాలు మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి. తాజాగా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని మర్డర్ చేయించేస్తానని బెదిరించారనే విషయం బయటకొచ్చింది. మరి ఆయన నిజంగా బెదిరించారో లేదో తెలియదు గానీ..రఘురామ మాత్రం ఆ విషయం చెబుతున్నారు. ఆ మధ్య అలాగే లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడుతుంటే..వారి మీదకు దూసుకెళ్లిపోయారు. పాపం ఇన్ని రకాలుగా మాధవ్ హైలైట్ అవుతూనే వస్తున్నారు.