మొత్తానికి కుప్పంలో వైసీపీ అనుకున్నది సాధించినట్లు కనిపిస్తోంది. అసలు మామూలు ఎన్నికలప్పుడే కుప్పంలో అడుగుపెట్టని చంద్రబాబుని...ఇప్పుడు కుప్పంలోనే ఇల్లు కట్టుకునే వరకు తీసుకొచ్చారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కుప్పం టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం చేశారు....పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి టీడీపీని ఏ విధంగా ఓడించారనే విషయం కూడా తెలిసిందే.

ఇక పెద్దిరెడ్డి దెబ్బకు..చంద్రబాబు ఫోకస్ మొత్తం కుప్పంపైనే పెట్టేలా చేశారు. ఇంకా కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని, వరుసపెట్టి కుప్పం వచ్చి...వారం రోజుల వరకు ఉంటానని, కార్యకర్తలకు టచ్‌లో ఉంటానని బాబు చెప్పే పరిస్తితి వచ్చింది. మొత్తానికైతే కుప్పం విషయంలో చంద్రబాబుకు కాస్త భయం వచ్చిందనే చెప్పాలి. కానీ ఎంత భయం ఉన్నా సరే ఆయన మళ్ళీ కుప్పం బరిలోనే దిగడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదేన చెప్పొచ్చు.

అదే సమయంలో చంద్రబాబు సేఫ్ సైడ్‌గా మరొక నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూనే ఉంది...ఇప్పటికే ఆయన కృష్ణా జిల్లాలోని పెనమలూరులో గానీ, విశాఖ సిటీలో ఏదొక నియోజకవర్గంలో పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి. ఈ కథనాలు వస్తున్న క్రమంలోనే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొస్తుంది..చంద్రబాబు విశాఖ సిటీలో నార్త్ సీటులో పోటీకి దిగుతారని ప్రచారం వస్తుంది. ప్రస్తుతం అక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆయన టీడీపీలో ఉంటారో ఉండరో తెలియడం లేదు.

ఒకవేళ ఉన్నా సరే ఆయన...మళ్ళీ నార్త్‌లో పోటీ చేసే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. గంటా మళ్ళీ భీమిలికి వెళ్లిపోవచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో చంద్రబాబు...నార్త్‌లో సేఫ్ సైడ్‌గా పోటీ చేయొచ్చని, పైగా విశాఖలో బరిలో దిగితే ఉత్తరాంధ్రలో టీడీపీకి ప్లస్ అవుతుందని కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా ప్రచారం మాత్రమే అని, బాబు విశాఖ బరిలో ఉండరని, కేవలం కుప్పం బరిలోనే ఉంటారని, ఆయన భయపడే రకం కాదని తమ్ముళ్ళు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp