ఒకవైపు ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు రావడమే కాదు ఇక ప్రయాణికులు అందరికీ మెరుగైన సర్వీసులు అందించడానికి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ రంగంలోకి దిగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి గురువారం కూడా ఆర్టీసీ బస్సు డే గా ప్రకటించాలని సజ్జనర్ స్వయంగా సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం. మరోసారి టి ఎస్ ఆర్ టి సి ఎమ్ డి సజ్జనార్ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల బాధలు అభిప్రాయాలను తెలుసుకున్నారు.
హైదరాబాద్లో ఉన్న తన నివాసం నుంచి లకిడికపూల్ మీదుగా టెలిఫోన్ భవన్ వరకు కాలి నడకన వచ్చిన సజ్జనార్ మెహదీపట్నం డిపోకు చెందిన బస్ ఎక్కి టికెట్ తీసుకొన్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా బస్ భవన్ వరకు బస్సు లో ప్రయాణించారు సజ్జనార్. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల తో ముచ్చటించారు. సిబ్బంది ప్రవర్తన సమయపాలన బస్సులో శుభ్రత సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తే ప్రయాణికుల కష్టాల తెలుస్తాయని.. అందుకే ఇలా ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.