అయితే అప్పుడు మంత్రివర్గంలో మహిళల కోటాలో ముగ్గురుకు లక్కీ ఛాన్స్ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితలు మంత్రివర్గంలో ఉన్నారు. ఇక వీరిని మంత్రివర్గంలో నుంచి తొలగిస్తే...వీరి ప్లేస్‌లో మరో ముగ్గురుకు అవకాశం కల్పించాలి. ఇక ఆ మూడు పదవుల కోసం...వైసీపీలో పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మంత్రి పదవి కొట్టేయాలని లేడీ ఫైర్ బ్రాండ్లు రెడీ అయ్యారు. ఇదే క్రమంలో మొదట నుంచి రోజా పదవి ఆశించే లిస్ట్‌లో ముందున్నారు. మొదట్లోనే పదవి కావాలని ట్రై చేశారు గానీ కుదరలేదు. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్తితుల్లో పదవి దక్కించుకోవాలని రోజా చూస్తున్నారు. అటు తొలిసారి గెలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సైతం...క్యాబినెట్‌లో ఛాన్స్ కొట్టేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పైగా ఇప్పుడు గుంటూరు నుంచి సుచరిత మంత్రిగా ఉన్నారు...ఇక రజినిది కూడా గుంటూరు జిల్లానే కాబట్టి...తనకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం మంత్రి పదవి ఆశించే లిస్ట్‌లో ఉన్నారు. ఎస్సీ కోటాలో పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్న వనిత, సుచరితలు ఎస్సీ కోటాలోనే మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వారిలో ఒక ప్లేస్ తనకే వస్తుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ ముగ్గురు లేడీ ఎమ్మెల్యేల్లో ఎవరికి లక్కీ ఛాన్స్ ఉంటుందో.