చైనా ఎన్నో రోజుల నుంచి విస్తరణ వాద ధోరణితో వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల అన్నింటినీ కూడా చైనాలో కలుపుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టిబెట్, హాంకాంగ్ లాంటి దేశాలను చైనా చైనా తమ దేశంలో కలుపుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఇక చైనాకు పొరుగు దేశంగా ఉన్న తైవాన్ పై ప్రస్తుతం చైనా కన్ను పడింది. దీంతో చిన్న దేశమైన తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సర్వ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి.


ఏకంగా తైవాన్ పై చైనా యుద్ధానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే చైనా తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విన్యాసాలు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. అయితే తైవాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ అగ్రరాజ్యమైన అమెరికా చైనా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ చైనా తీరు లో మాత్రం మార్పు రావడం లేదు. అదే సమయంలో చిన్న దేశం అయిన ప్పటికీ చైనా దుశ్చర్యలను ఎప్పుడూ ఖండిస్తూ వస్తుంది తైవాన్.  చైనా కు వార్నింగ్ కూడా ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.


 అయితే తైవాన్కు చెందిన దీవులను స్వాధీనం చేసుకునే సమయంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చైనా సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ కూడా సిద్ధం అయింది అని తెలుస్తుంది. చైనాను దీటుగా ఎదిరించడానికి కిల్లర్ కోర్ టీమ్ ని రంగంలోకి దించింది తైవాన్. చైనా ఏ వైపుగా దీవులను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమౌతుంది అన్న విషయాలను గ్రహించి ఇక ఆయా ప్రాంతాలలో రిటర్న్ ఎటాక్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది అని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది మాత్రం ఊహించని విధంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: